స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

మందమర్రి మందమర్రి ఏరియాలోని కేకే2 ఉపరితల గనీలో భూములు కోల్పోయిన వారితో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపరిత గనిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దనపల్లి పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ నూతన జిఎం మోహన్ రెడ్డి ని కలిసి విన్నవించారు*. మందమర్రి ఏరియా నూతన జిఎంగా బాధ్యత స్వీకరించిన మోహన్ రెడ్డిని సర్పంచి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఉపరితల గని వాళ్ళ ఏర్పడే పలు సమస్యలను జీఏం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నిరుద్యోగులను ఆర్ వి ఆర్ కాంట్రాక్టు సంస్థ ఉద్యోగాలు కనిపించడం లేదని అన్నారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్న డ్రైవర్ల సమస్యలపై సైతం పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే డ్రైవర్ల సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని విన్నవించారు..