సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్.

రెబ్బెన,రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాని హెచ్చరించారు.48 గంటల సమ్మెలో భాగంగా రెండవ రోజు మంగళవారం కొమురం భీం జిల్లా డిఎంహెచ్ ఓ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు టి.దివాకర్ అధ్యక్షతన నిర్వహించి ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ అంజు భాను కు వినతిపత్రం సమర్పించారు.ఈసందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి చాలిచాలని వేతనాలు తీసుకుంటూ,పేద,బడుగు బలహీన వర్గాల ఆరోగ్యాన్ని కాపాడంలో సెకండ్ ఏఎన్ఎంలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 48 గంటల సమ్మె చేయడం జరిగిందన్నారు.సెకండ్ ఏఎన్ఎం లకు.100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు,సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ పదిలక్షలు కల్పించి,మరణించిన ఏఎన్ఎం కుటుంబం నుంచి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,తక్షణమే పెండింగ్ లో ఉన్న పిఆర్సి బకాయిలు చెల్లించాలని,8 గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో నిరవధిక సమ్మెను చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎం లు వసంత,సంతోషి,ప్రమీల,తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.