సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదిలాబాద్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మావల పద్మనాయక ఫంక్షన్ హాల్లో సీజనల్ వ్యాధులను నియంత్రణ, సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలను పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అధికారులను అభినందించారు.వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త లను వేరువేరుగా సేకరించి శేగ్రిగేషన్ షెడ్డు కు తరలించాలని సూచించారు. రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, మురికి కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలని ఇంటి పరిసరాలలో పాడైన టైర్లు, నీటి ట్యాంకులు, బాటిల్స్, రంజన్లు, కూలర్స్, కొబ్బరి బొండం లలో నీరు నిల్వ లేకుండా శుభ్రం చేయాలి అన్నారు. దోమల వలన వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ గణపతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాథోడ్ నరేందర్, ఐటిడిఎ డిడి దిలీప్ కుమార్, బిసి సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సి కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈఓ రాథోడ్ రాజేశ్వర్, ఎంపిడిఓలు, ఎపిఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.