సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

ఆదిలాబాద్ : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని అబ్దుల్లా చౌక్ లో గల ప్రధాన భారి మురికి కాలువలో నిల్వ అయిన వ్యర్థాలను శనివారం జెసిబి సహాయంతో పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాల కారణంగా నీరు ఆగిపోగా.. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్.. సత్వరమే స్పందించి ముమ్మరంగా పనులు చేయించారు. వైస్ చైర్మన్ జహీర్ రంజాని తో కలిసి పనులను పర్యవేక్షించిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపదుతున్నామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తెలిపారు అలాగే అబ్దుల్లా చాపల చేపడుతున్న పెద్ద డ్రైనేజీ నాళాలలో ఇబ్బంది తలెత్తకుండా పెద్దనాల నిర్మాణాన్ని పనులను పూర్తి దశకు చేరుకోగా అక్కడ పనులను పరిశీలించారు రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి గానూ పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నా.. స్థానికులు తమను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు సైతం పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి.. వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయిస్ ఛైర్మెన్ జెహిర్ రంజాని, వార్డ్ కౌన్సిలర్ మోబిన్, భాష అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.