సివిల్స్ పరీక్షా ఫలితాల్లో జిల్లాకు చెందిన మద్దెల భార్గవ్ 554 వ ర్యాంకు

భార్గ‌వ్‌కు ఎమ్మెల్యే ఘ‌న స‌న్మానం

ఆదిలాబాద్: ఇటివల విడుదలైన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో జిల్లాకు చెందిన మద్దెల భార్గవ్ 554 వ ర్యాంకు సాధించగా… శనివారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే జోగురామన్నను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భార్గవ్ ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేను సైతం ఘనంగా సత్కరించారు. యువతకు ఆదర్శంగా నిలిచేలా ఉన్నతంగా ఎదగడం పట్ల ఎమ్మెల్యే జోగురామన్న హర్షం వ్యక్తం చేశారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ లు మార్శెట్టి గోవర్ధన్, తుల శ్రీనివాస్, 49 వ వార్డు బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.