సాఫ్ట్ బాల్ జాతీయస్థాయి పోటీలకు ఆరుషి ఎంపిక

నేరేడిగొండ మండల కేంద్రంలోని జడ్పీహెచస్ ఉన్నత పాఠశాల సాఫ్ట్బాల్ పోటీలకు జాతీయస్థాయిలో విద్యార్థిని ఎంపిక ఎనిమిదవ తరగతి చదువుతున్న అరుషి అనే విద్యార్థిని సాఫ్ట్బాల్ పోటీలకు జాతీయస్థాయిలో ఎంపిక కావడం జరిగింది.ఈసందర్భంగా ఎంఈఓ భూమారెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆడాలని ఉద్దేశం ఉన్న కొందరి ఆర్థిక పరిస్థితుల వల్ల క్రీడలు ఆడలేక పోతున్నారు ఆడిన ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు నేరడిగొండ మండల కేంద్రం నుండి అది మా స్కూల్ నుండి ఎంపికైనందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంపికైన అరుషినీ జాతీయ స్థాయి క్రీడలకు పంపేందుకు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు తనను ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందించినందుకు తన ఉపాధ్యాయులకు అరుషి కృతజ్ఞతలు తెలిపింది.