సవారి బంగ్లా నిర్మాణానికి భూమి పూజ‌

ఆదిలాబాద్‌, పట్టణంలోని ఖానాపూర్ లో నిర్మించనున్న సవారి బంగ్లా నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ శుక్రవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మూడు లక్షల వ్యయంతో బంగ్లాను నిర్మించనుండగా.. స్థానిక నేతలతో కలిసి భూమిపూజ చేశారు. బంగ్లాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వారికి ఇబ్బంది తలెత్తకుండా నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో సవారి బంగ్లాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.