సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ

బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలైందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం నుండి అభ్యర్థులు తమ కేటాయించిన స్థలాలలో వేచి ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ప్రశాంతంగా చేయించుకుంటున్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా కేటాయించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈరోజు 500 అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 445 అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఆదనపు ఎస్పీ సి సమై జాన్ రావు, ఏవో యూనిస్ అలీ జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.