సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు

ఉట్నూర్: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని డిడి డా. దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలను సమర్పించారు. ఉట్నూర్ మండలం వేణునగర్ గ్రామానికి చెందిన రాథోడ్ రాజు కుల పత్రం మంజూరు చేయించగలరని గాదిగూడ మండలం పరశ్వడా గ్రామానికి చెందిన సిడం అనిత ఏకలవ్య మాడల్ రెసిడెన్సియల్ ఉట్నూర్ నందు అడ్మిషన్ ఇప్పించాలని కోరారు, ఉట్నూర్ మండలం లక్షెట్టి పేట్ గ్రామాన్ని చెందిన మడావి షెకు తనకు రైతుబంధు ఇప్పించమని కోరారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో ఎపిఓ పివిటిజి ఆత్రం భాస్కర్, ఓ యస్ డి కృష్ణయ్య , డిపిఓ ప్రవీణ్, మేనేజర్ లింగు ఐటిడిఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.