సమరానికి సన్నద్ధంకండి
కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపు

బోథ్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఎన్నికలు అనే సమరానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22 నుండి 30 వరకు ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి భారతీయ జనతా పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా బోథ్ మండల సంయుక్త మోర్చాల సమ్మేళనం నిర్వహించి కార్యకర్తలకు, నాయకులకు దిశనిర్ధేశం చేశారు.ఈకార్యక్రమంలో నాయకులు రత్నాకర్ రెడ్డి మయూర్ చంద్ర మానాజీ సూర్యకాంత్.శేఖర్ నాయకులు. పాల్గొన్నారు.