శారీరక, మానసిక ఆరోగ్యానికి పరుగు ఎంతో ముఖ్యం

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్: శారీరక, మానసిక ఆరోగ్యానికి పరుగు ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోలీస్, యువజన సర్వీసుల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో కలసి కలెక్టర్ క్రీడా జ్యోతి వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ క్రీడాజ్యోతితో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్ మీదుగా తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అందరు భాగస్వాములై విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు నిర్వహించిన తెలంగాణ రన్ లో అధికారులు, వివిధ విభాగాలకు చెందిన పోలీసులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, వివిధ వర్గాల ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల సభ్యులు, ఉద్యోగులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వివిధ విభాగాల పోలీసులు, ప్రజలు, క్రీడాకారులు, వివిధ వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.