వెనుకబడిన కాలనీలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి

ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి వందల కోట్లు కేటాయిస్తున్నమంటున్న బిఆర్ఎస్ నాయకులు, మరి వెనుకబడిన కాలనీలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి ప్రశ్నించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్రం అమృత్ పతకంలోవంద కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని తాటి గూడలో ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్నిఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఇల్లు లేక పేదవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని పేర్కొన్నారు. వర్ష కాలం దృష్ట్యా ఇంట్లో నీళ్ళు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే కేంద్రం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందకుండా అడ్డుకుంటుంది అని అన్నారు.ఆమె వెంట పార్టీ నాయకులు ,కాలని వాసులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.