విశ్వహిందూ పరిషత్ నూతన కార్యవర్గానికి అభినందనలు

ఆదిలాబాద్: జిల్లా విశ్వహిందూ పరిషత్ నూతన కార్యవర్గానికి అభినందనలు బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు అయిన నారాయణ ,కృష్ణ లను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్ భాగస్వామ్యం ఎంతో ఉంది అన్నారు. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా హిందూ ధర్మాన్ని నిలబెట్టడంలో విశ్వహిందూ పరిషత్ ముందుంది అన్నారు. కొన్ని సామాజిక వర్గాలు హిందువులను ప్రలోభ పెట్టి భయపెట్టి మతమార్పిడులకు పాల్పడుతుంటే విశ్వహిందూ పరిషత్ ఈ మతమార్పిడులను అడ్డుకుంది అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ హిందూ సమాజానికి సేవలు అందిస్తుందని అన్నారు. నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తూ మరింత ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దినేష్ మటోలియ. జ్యోతి రెడ్డి.ముకుంద ఆకుల ప్రవీణ్ కార్యకర్తలు ఉన్నారు.