విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి
ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. పట్టణంలోని బంగారి గూడలో గల మదర్సాలో సోమవారం ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను అందించి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతోందని అన్నారు. మైనారిటీలు విద్యాపరంగా రాణించాలన్న ఉద్దేశంతో అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, గత ప్రభుత్వాల హయంలో ఎదుర్కున్న ఇబ్బందులను వివరించారు. ప్రతిపక్షాల మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు. విద్యార్థులు తల్లితండ్రుల కళలను నిజం చేసేలా కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తు పొందాలన్నారు.మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, మదర్సా నిర్వాహకులు అబ్దుల్ అజీం, ఎతేశాం, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.