విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పంపిణీ

జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్

ఇంద్రవెల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దిందని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థుల ఉచిత బస్ పాస్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…మన ఊరు మన బడి పథకం కింద సర్కార్ బడులను అద్భుతంగా తీర్చదిద్దరని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆర్టీసి సిబ్బందికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్కగుడా సర్పంచ్ భీంరావు, ఆర్టీసి సిబ్బంది సాంబ శివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిలావత్, గోపాల్ సింగ్ మాజీ ఎంపీటీసీ సత్యానంద్,చైల్డ్ ప్రొటెక్షన్ పోరం జిల్లా సభ్యులు బోస్లే రవికాంత్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, జెడ్పీఎస్ఎస్ పాఠశాల చైర్మన్ బాపురావు, జునెద్,జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యులు మర్సుకొల తిరుపతి,బంజారా యువసేన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సంజీవ్ నాయక్,నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.