విత్తన దుకాణాలు తనిఖీ

నేరడిగొండ:మండల కేంద్రం లోని విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. విత్తన విక్రయదారులు రైతులకు ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దుకాణాల్లో విత్తనాల ధరలు మరియు స్టాక్ లభ్యత తదితర వివరాలు తెలిపే బోర్డ్ పెట్టాలన్నారు.ఈసందర్బంగా వ్యవసాయ అధికారి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. విత్తన విక్రయ దారులుఎవరైనా పాకెట్ పై వున్న ఎంఆర్‌పీ ధర కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లు అయితే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విత్తనం కొనేటపుడు తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు.రశీదులో పూర్తి వివరాలు ధర, కంపెనీ పేరు, విత్తన పేరు, లాట్ నంబర్ తదితర అంశాలు ఉండాలి. అసంపూర్తి రశీదు, మరియు ధర సరిగా లేకుండా రశీదు ఇచ్చినట్లు అయితే వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలి అని అన్నారు.