విత్త‌నాలు దొర‌క‌క ఇబ్బందులు ప‌డుతున్న రైతులు

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి

ఆదిలాబాద్‌: ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న ఆదిలాబాద్ లో రైతులకు అవసరమైన విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడు తూ ఒకవైపు రైతుల విత్తనాల కోసం పడిగాపులు కాస్తుంటే జిల్లాకు వచ్చిన విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు.రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అలాగే రాష్ట్రాన్ని విత్తన బాండాగారంగా చెప్పుకునే భారాస నాయకులకు రైతుల కష్టాలు కనపడడం లేదా అని ప్రశ్నించారు.ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునీ,ఎకరాకు 10,000 రూపాయల రైతు బందు ఇచ్చి రైతులకు అందాల్సిన సబ్సిడీ లు ఇవ్వకపోవడంతో రైతుపై 20000 రూపాయల అదనపు భారం పడుతుందని,రైతుబందు కేవలం భూస్వాములకు మాత్రమేఉపయోగపడుతుందని,కౌలు రైతులకు మాత్రం రైతు బందు,రైతు భీమా ఇవ్వడం లేదని,చివరికి పంట అమ్ముకోవడానికి కూడా ఆంక్షలు పెడుతున్నారని,ఇకనైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రైల్వే బోర్డ్ మెంబర్ జీవి రమణ, గటిక క్రాంతి కుమార్,సంతోష్ కొత్తపెల్లి,కాంత,నరేష్ తోకల,రాము గెడం,ముఖీమ్, అరిఫ్,గణేష్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.