వచ్చామా… ఫోటో తీసుకొని వెళ్ళిపోయామా అన్నట్టు బడిబాట కార్యక్రమం

ఇంద్రవెల్లి: మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. జూన్ 12 నుంచి 17 వరకు బాడీ బాట కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బడిబాట ముఖ్య లక్ష్యం బాల కార్మికులను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలి. బడి బయట ఉన్న వారిని గుర్తించి వారికి పాఠశాలయొక్క మౌలిక వసతులు గురించి అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించాలి. అన్నిగ్రామాలలో ఇంటింటికి సర్వే నిర్వహించి ర్యాలీలు కరపత్రాలు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలలో భాగమే. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాలు, మెరుగైన చదువు గురించి వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వివరించాలి. చదువుపై విద్యార్థులకు చైతన్య పరచాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బడిబాట కార్యక్రమంనిర్వహించడానికి వచ్చిన ఉపాధ్యాయులు ఎవరితోనో చర్చించకుండా గ్రామ పటేల్ ,దేవరి లతో సమావేశం నిర్వహించి తీర్మానం చేసి వేరే వారిలతో సంతకాలు పెట్టించుకుంటున్నారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించకపోగా ప్రశ్నించే వారికి ఎదురు దాడికి దిగుతున్నారు.వచ్చామా ఫోటో తీసుకొని వెళ్ళిపోయామా అన్నట్టు ప్రభుత్వ ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.