రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

జైనథ్ మండలం నిరాల నుండి లాండసాంగి వరకు నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. శనివారం జిల్లకేంద్రనికి వచ్చిన ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నీరాల నుండి అర్లి టీ మీదుగా ప్రారంభం కానున్న రోడ్డు నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ఇటివల తరణం బ్రిడ్జ్ పగుళ్ళు వచ్చి రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.డి సురేష్,ఉన్నారు.