రైతు శిక్షణ కేంద్రాలుగా ఉద్యాన నర్సరీలు

ఐటీడీఏ పిఓ చాహత్ భాజ్ పాయ్

ఉట్నూర్:ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలో ఉన్న నాలుగు ఉద్యాన నర్సరీలను(ఉట్నూర్ , జంబుగా భీమారం,బెల్లంపల్లి ) రైతు శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నామని ఐటిడిఎపిఓ చాహత భాజ్పేయి అన్నారు.ఈమేరకు బుధవారం ఉట్నూరులోని (హెచ్ఎన్ టీసీ) ఉద్యాన నర్సరీని ఆమె సందర్శించారు. నర్సరీలో ఈ సంవత్సరం పెంచుతున్న మొక్కల గురించి ప్రాజెక్టు హార్టికల్చర్ అధికారి (పీహెచ్ఓ) గుడిమల్ల సందీప్ కుమార్ వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందజేయడానికి కృషి చేయాలని , అన్ని రకాల పండ్ల మొక్కలను తయారు చేయాలని , దానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.నర్సరీ లో ఉన్న మామిడి తోటలో,యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. నర్సరీలో మొక్కలను పరిశీలించారు.పసుపు , డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలను ప్రయోగాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో (పీహెచ్ఓ) సందీప్ కుమార్ ,( హెచ్ ఓ )పి సుధీర్ కుమార్ , ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.