రైతులపై కక్ష సాధిస్తున్న కాంగ్రెస్
డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి

ఆదిలాబాద్: రైతులకు మూడు గంటల విద్యుత్తు ఇస్తే సరిపోతుందన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన… చంద్రబాబు బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి సైతం అదే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. అన్నదాతలకు అండగా ఉంటూ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తోందన్న ఆయన.. మూడు గంటల విద్యుత్తు మాత్రమే సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు అద్దం పడతాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయంలో రైతులు ఎదుర్కున్న ఇబ్బందులను గుర్తు చేస్తూనే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీ.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నామని, నిరసనలో రైతులు భారి సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు రోకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్ , గంగారెడ్డి, పోత రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,జంగిలి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.