రైతులకు 24 గంటల కరెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే

ఇంద్రవెల్లి: .రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ విషయంపై కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రస్తావించిన వాక్యాలను వక్రీకరిస్తూ మాట్లాడిన కేటీఆర్ ,బిఆర్ఎస్ నాయకులకు నిరసనగా బుదవారం ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కెసిఆర్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు అందిస్తామని మాయ మాటలు చెప్పి 8 గంటకు మాత్రమే అందించి రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముకాడే ఉత్తమ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ప్రతి పేద రైతులకు 200 యూనిట్లు వరకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జహీర్, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకట్రావు, సొంకంబ్లే జితేందర్, అత్రం కళ్యాణ్, చాకటి మనిక్ రావ్, కొడప హచ్చ్ పత్ రావ్,తొడసం శ్రీనివాస్,కోసెరవ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.