రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్

ఆదిలాబాద్:రైతులకు కావలసిన విత్తనాలను ఇవ్వకుండా నాసిరకాపు విత్తనాలను ఇస్తున్నటువంటి ఫెర్టిలైజర్ షాప్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులకు విత్తన కొరత రాకుండా చూడాలని, నాసిరకం విత్తనాలు అందిస్తున్న షాప్ డీలర్ల పై వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్, జిల్లా ఇన్చార్జ్ రత్నపురం రమేష్ లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు వెళ్లి జాయింట్ కలెక్టర్కు మేమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్, జిల్లా సెక్రెటరీ ఆరిఫ్ మీర్జాబేగ్, జిల్లా మహిళా కన్వీనర్ ప్రేమకల, అదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షురాలు మేస్రం మీనా, ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సిర్ర సంతోష్, జైనథ్ మండల కన్వీనర్ రావుల కొచ్చన్న సోషల్ మీడియా అదిలాబాది ఇంచార్జ్ సుజన్ పాటిల్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.