రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ కి సన్మానం

తలమడుగు : తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సోమవారం హైదరాబాద్ లో ని పర్యాటక శాఖ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు. రాష్ట్ర పర్యాటక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.