రాష్ట్రం 24 గంటల విద్యుత్ సరఫరాతో దేశంలోనే గొప్ప ఖ్యాతి సాధించింది

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుండి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక ఎస్టీయూ భవన్ లో నిర్వహించిన విద్యుత్ దినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, స్థానిక శాసన సభ్యులు జోగు రామన్నలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్, ఎమ్యెల్యే లు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతిలో అత్యంగ కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాల ప్రగతి నివేదికను ఎస్.ఈ. సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఎందరో అమరుల త్యాగాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 24 గంటల విద్యుత్ సరఫరాతో దేశంలోనే గొప్ప ఖ్యాతిని సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎంపీపీ గోవర్ధన్, డిఇ సుభాష్, ప్రజాప్రతినిధులు, రైతులు, వినియోగదారులు, విద్యుత్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.