మొక్కలు నాటిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఐక్యంగా ఉంటూ కుల సంఘాల అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ లో సోమవారం నిర్వహించిన గౌడ గడప హరితాహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ కి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు మంగలహారతులతో సాదరంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుల్ల నడుమ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈత చెట్లను నాటి నీరు పోశారు. ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. . ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ…. పర్యావరణ పరిరక్షనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితాహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని అన్నారు. హరితాహారం ను పకడ్బందీగా అమలు చేయడంతో ఏడూ శాతం అడవులు పెరిగిన విషయాన్నీ గుర్తు చేశారు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన ఆయన… కులస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను నిక్షిప్తం చేసుకోవాలని అన్నారు. దాని ద్వారా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించుకోవచ్చని తెలిపారు.మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, గౌడ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు గజనంద్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, నాయకులూ పందిరి భూమన్న, సాజిదోద్దీన్, స్వరూప రాణి,నల్ల మహేందర్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.