మున్సిపల్ చైర్మన్ సన్మానించిన టిఎంఆర్పిఎస్ నాయకులు

ఆదిలాబాద్: ఇటీవల జరిగిన రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ఆదిలాబాద్ పురపాలకం పలు అవార్డులను సాధించడంతో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తోపాటు కమిషనర్ శైలజలను వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం టిఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ను శాంతినగర్ లోని తన నివాసంలో కలిసి శాలువా పుష్పగుచ్చలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కమిషనర్ ను సైతం సత్కరించరు.అదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న కృషి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పట్టుదలతో అదిలాబాద్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కొనియాడారు.రానున్న రోజుల్లో ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉండాలని ఆకాంక్షించారు.టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ. అధికార ప్రతినిధి నక్క రాందాస్ మాదిగ జిల్లా ప్రధాన జువాక నర్సింలు.జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కత్తి గంగాధర్, జిల్లా కార్యదర్శి తారా రవి, కల్లేపల్లి మల్లయ్య గోడికే మధుకర్, సిందే సంజయ్.. తదితరులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.