మున్సిపల్ కమిషనర్ బిఆర్ఎస్ కార్యకర్తనా..!

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి

ఆదిలాబాద్: మున్సిపల్ కమిషనర్ రోజు రోజుకి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తయారవుతుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. అదిలాబాద్ ఎమ్మెల్యే పుట్టినరోజు ఉందని మున్సిపల్ అధికారులను కార్మికులను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనాలని ఒక మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ జోగు రామన్నకు జోగు ప్రేమెందర్ కు ఇలా మద్దతు పలకడం ఏంటని ప్రశ్నించారు అదిలాబాదులో నీటి కొరత చాలా ఉంది దానిపై దృష్టి సారించడం లేదు కానీ ఇలా మున్సిపల్ అధికారులను కార్మికులను బెదిరించడం సరికాదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి అధికారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.