మీకోసం గూడు కట్టేవారికి న్యాయం చెయ్యండి

బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలలో రాష్ట్రప్రభుత్వం కార్మికుల కోసం చేసింది ఏమీలేదు, స్థానిక ఎంఎల్ ఏ జోగు రామన్న తన కోసం పెద్ద బంగాళాలు కట్టుకున్నాడు కానీ ఆ బంగాళాలు కట్టిన కార్మికులకు జానెడు ప్రభుత్వ భూమి ఇవ్వలేదు, ప్రభుత్వ భూములను బీఆర్ ఎస్ నాయకులు కబ్జాలు చేశారు, మిగిలిన భూములను ప్రభుత్వం అమ్ముకుంది కానీ పేదలకు మాత్రం అన్యాయం చేసింది అన్నారు. జిల్లాలో వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వారికి కనీసం నిలువ నీడ లేకుండా జీవిస్తున్నారని అన్నారు, భవన నిర్మాణ కార్మికులకు కాలనీ కోసం స్థలాన్ని కేటాయించాలి, 50 సంవత్సరాలు దాటినా కార్మికులకు 5000 ల పెన్షన్ ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలి, కార్మికులకు పది లక్షల వరకు ఉచిత హెల్త్ కార్డ్ అందించాలనే ముఖ్యమైన డిమాండ్లతో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందచేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు ఆకుల ప్రవీణ్. చిలుకూరి జ్యోతి రెడ్డి.ముకుంద్. శివా.గోపీ.భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు.. బండారి . హోసన్న నారాయణ పెంటాజి రాజు.కార్మికులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.