మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

తలమడుగు: సోమవారం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం తో అనుసంధానం అయ్యే తలమడుగు మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ను మరియు తలమడుగు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగింది. సరిహద్దు గుండా ఎలాంటి అక్రమ మార్గం లో కానీ అనుమతులు లేనటువంటి వాటిని అనుమతించకూడదని, సరిహద్దు ప్రాంతంలో సంచరించే వాహనాలను సీసీ కెమెరాల నిఘా లో పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. సరిహద్దు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు. తలమడుగు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ ఆవరణను, రిసెప్షన్ సెంటర్, రికార్డులను, జీడి, సిబ్బంది నిర్వహించే విధులను పరిశీలించారు. అలాగే ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని లేనియెడల శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ తెలిపారు ఐ సైదారావు, తలమడుగు ఎస్ఐ జి అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు.