మనస్ఫూర్తిగా కమలం గుర్తుకు ఓటెయ్యండి
బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్

ఆదిలాబాద్: ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు మనస్పూర్తిగా ఓటేయండి అభివృద్ధికి బాటలు వేయండి అని అన్నారు పట్టణంలో భగత్ సింగ్ నగర్ కాదు పలు కాలనీలో ఇప్పటికీ అభివృద్ధికి నోచకుండా కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేశాం వందల కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పుకునే జోగు రామన్న ఒక్కసారి పట్టణ శివార్లలోని కాలనీలో నడిపించుకుంటా తిప్పాలి అని అన్నారు. ఒక్క వర్షానికి పట్టణమంతా చిత్తడిఐ బురదమయం అయిపోయింది వర్షపు నీటిపారుదల వ్యవస్థ లేకుండా పట్టణం ఎలా అభివృద్ధి చెందింది అని అన్నారు. గుడిసెల్లోనూ రేకుల ఇండ్ల షెడ్లలోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు తమకు బెడ్ రూమ్ డబల్ బెడ్ రూమ్లు వస్తాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పేదల ఆశలు అసలు గానే మిగిలిపోయాయి అన్నారు. ఈ పర్యటనలో జిల్లా నాయకులు. ముకుంద్ రవు. . రత్నాకర్ రెడ్డి. మయూర్ చంద్ర. ధోని జ్యోతి. రాజు గణేష్ రవి.. మహిళా నాయకులు కార్యకర్తలు పా