మనమరాలకి జోల పాట

బోథ్: మండలంలో నిర్వహిస్తున్న గ్రూపు ఫోర్త్ పరీక్షలు రాయడానికి వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు శనివారం హాజరయ్యారు అదిలాబాద్ జిల్లా టైలర్స్ కాలనీకి చెందిన అబ్దుల్ ఫిరోజ్ తన కూతురు మండలంలోని వాగ్దేవి కాలేజీలో పరీక్ష కేంద్రం లో పరీక్ష రాయడానికి వెళ్లగా రోడ్డు పక్కనే ఉన్న ఓ మామిడి చెట్టు కి ఉయ్యాల కట్టి కూతురు బిడ్డ తన మనుమరాలినీ ఆడిస్తూ జోల పాటలు పాడుతూ నిద్ర పుచ్చుతూ వార్తాపత్రిక కెమెరాకు చిక్కిన దృశ్యం ఇది