మందు పంపిణీ

ఆదిలాబాద్ః మృగశిర కార్తేను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రనతో పాటు రోగ నిరోధక శక్తి ని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణి కార్యక్రమం ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున సాగింది. జిల్లా కేంద్రంలోని సీసీఐ సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించిన ఆయుర్వేదిక్ మందు పంపిణి కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యువరాజ్ వైద్య దంపతులు, కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రజలకు గుళికల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు.. మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ కార్యక్రమంలో పాల్గొని ఆయుర్వేదిక్ మందును వేసుకున్నారు. ఉబ్బసం వ్యాధి నియంత్రణకు వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ద్వార మందు పంపిణి చేపడుతున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు యువరాజ్ వైద్య మాట్లాడుతూ.. దమ్ము, ఉబ్బసం వ్యాధి నియంత్రనతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మందును ఉచితంగా పంపిణి చేస్తున్నామని అన్నారు. రుతువులు మారే సమయంలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకోవడానికి ఆయుర్వేద మందు విశేషంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.