మంచిర్యాల ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేశా

పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్

చెన్నూరు: మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 2021-2023 రెండు సంవత్సరాల పాటు అందరి సహాయ సహకారాలతో తన వంతు వైశ్యుల, వైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేశానని మంచిర్యాల పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు
దొంతుల ముఖేష్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక వైద్యభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో
రెండు సంవత్సరాలు కాలపరిమితి పూర్తయిన సందర్భంగా వైశ్య సంఘం, యువజన సంఘం కార్యవర్గంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడుతో పాటు జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర మహాసభ కార్యదర్శి ముక్తా శ్రీనివాస్ తో పాటు జిల్లా బాధ్యులకు రాజీనామా పత్రంను అందుకారు పట్టణ వైళ్ళ సంఘం తదుపరి ఎన్నికలను నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు రెండు సంవత్సరాల పాటు తనకు అధ్యక్ష పదవిని నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అందుకు సహకరించిన వారికి దొంతుల ముఖేష్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నికైన తర్వాత వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతోపాటు ఆలయం రెనోవేషన్ చేయించడం జరిగిందని, రెండేళ్ళ పాటు కన్నులపండువగా వైభవోపేతంగా గణపతి నవరాత్రులను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్తా శ్రీనివాస్, జిల్లా మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ చిలువేరు రమేష్, జిల్లా పీఆర్ఓ కేశెట్టి వంశీకృష్ణ, మాజీ అధ్యక్షులు చిలువేరు వైకుంఠం, వైశ్య సంఘం కార్యదర్శి అంచూరి నగేష్, కోశాధికారి ముస్త్యాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త రాజేశం, సమన్వయకర్త గంప చంద్రశేఖర్, యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, కార్యదర్శి తనుకు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కొత్త జయప్రకాష్, నాయకులు అక్కెనపెల్లి రవీందర్, చిలువేరు ప్రవీణ్, గుండ విజయప్రసాద్, సాయిసూరజ్, ఎలుక కళ్యాణ్, అప్పాల శ్రీధర్, వుత్తూరి తిరుపతి, నాగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.