భూ సమస్యలను ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి

భూ సంబంధ సమస్యలను మీసేవ కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని, నిబంధనల మేరకు పరిష్కరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అన్నారు. భూ సంబంధ సమస్యలను ధరణి పోర్టల్ లోని వివిధ మాడ్యూల్ల ద్వారా పరిష్కరించుకోవచ్చని, అర్జీదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సంబంధ,ఫించన్,ఉపాధి, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, తదితర సమస్యలపై వచ్చిన అర్జీలను దరఖాస్తుదారులు అదనపు కలెక్టర్ కు అందజేశారు.ఈప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.