భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని సురక్షితంగా అందించాలి

రెబ్బెన, బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని జిఎం కార్యాలయం ఆవరణలో స్వచ్ఛత పక్వాడ రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఏరియా జీఎం గాజర్ల దేవేందర్ ఉద్యోగులకు జనపనార సంచులను పంపిణి చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని సాద్యమైనంత వరకు తగ్గించాలని,మార్కెట్ వెళ్ళినప్పుడు నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన సమయంలో వెంట ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్ట లేదా జనపనార సంచులను తీసుకెళ్లాలన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని సురక్షితంగా అందించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం ప్రదానం అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని ప్రతీ సింగరేణి ఉద్యోగికి జ్యుట్ బ్యాగ్ ( జనపనార సంచులు) అందిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో డీజిఎం(ఐఈడి) ఉజ్వల్ కుమార్ బెహార, పర్సనల్ మేనేజర్ ఐ. లక్ష్మన్ రావు,డివై పిఎం రెడ్డిమల్ల తిరుపతి,సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ నవనీత,సీనియర్ పర్సనల్ అధికారి జీకే.కిరణ్ కుమార్,జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్,ఎన్విరాన్మెంట్ అధికారి ఎ.హరీష్,జిఎం కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు