బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ అధ్యక్షుడిగా దాసారపు రాజు

కాసిపేట :డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన న్యాయవాది దాసారపు రాజు నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసారపు రాజు మాట్లాడుతూ తెలంగాణలో బహుజనుల బతుకులు మార్చడానికి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ తో కలిసి బహుజనులను ఐక్యం చేసి బహుజన రాజ్యాధికారం కోసం, బెల్లంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి బిఎస్పీ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.