బీసీ ల్లో అన్ని వర్గాల వారికి రుణాల అందించాలని వినతి

తలమడుగు : రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తులతో పాటు అన్ని వర్గాల వారికి రుణాలు అందించాలని సోమవారం తలమడుగు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాసిల్దార్ వనజ రెడ్డి కి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ మాట్లాడుతూ బీసీల్లో గల అన్ని వర్గాలకు ప్రభుత్వం రుణాలను అందించాలన్నారు.. కులవృత్తులకు దరఖాస్తుకు గడువును పొడగించాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అధికారులు త్వరగా అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న, అధికార ప్రతినిధి గాజుల సాంబశివ్, తలమడుగు గ్రామ కమిటీ అధ్యక్షులు అసం రవీందర్, శశి కాంత్ యాదవ్, వినోద్, శ్రీనివాస్, బ్రహ్మం వివిధ గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు..