బీసీ గణన చేపట్టాలని అర్థరగ్న ప్రదర్శనకు పిలుపు

బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్మల శ్రీనివాస్

ఆదిలాబాద్ బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 14వ తేదీ శుక్రవారం అర్ధ నగ్న ప్రదర్శన చేస్తున్నట్లు బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు బీసీ గణనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. దీనికి నిరసనగా పట్టణంలోని ఐదు చౌరస్తా వద్ద అర్ధ నగ్న ప్రదర్శన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. బీసీ లందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.