బీసీల గత హామీలను అమలు చేయాలి

టీబీఎస్ఎస్ తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలుగా చెప్పబడే బీసీలకు గతంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని టీబీఎస్ఎస్ తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ రాజలింగు మోతే మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులు చేసే వారికి రూ. లక్ష తో సరిపెట్టకుండా.. వారి జనాభా ధమాషా ప్రకారం నిధులు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు ,బీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కి వెయ్యి కోట్లు, ప్రతి కుల ఫెడరేషన్ కు వంద రూ.కోట్లు, సంచార జాతుల ఫెడరేషన్ కు రూ. వంద కోట్లు కేటాయిస్తామని తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలన్నారు. సమావేశంలో టీబీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అడ్వకేట్ మోతె రవికుమార్, బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.