బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి

బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్

ఆదిలాబాద్ :భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు .మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో. కొలిపురా లో ప్రారంభించారు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు సమాజంలోని అన్ని వర్గాల వారికి అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడేలా ఈ పథకాలు ఉన్నాయని అన్నారు. నేడు ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేస్తూ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించి సాధించుకున్న తెలంగాణ ప్రజలు బీఆర్ ఎస్‌ పాలనలో నేడు వంచనకు గురవుతున్నారని అన్నారు. దేశ చరిత్రలో మోసాలు చేసేవారిని ఎంతోమందిని చూశాం కానీ ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడం కెసిఆర్ హయాంలో మాత్రమే చూస్తున్నామని అన్నారు. కేవలం కొన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని.. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో వార్డు నెంబర్ 27 కొలిపురా ప్రాంతంలోని ఇండ్లకు వెళ్లి ప్రజలను పలకరించారు మరియు వీధి వ్యాపారులను కూరగాయలు అమ్ముకునే వారిని కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు. జోగు రవీ. ఆకుల ప్రవీణ్. రాజేశ్. ముకుంద్. ధోని జ్యోతి. రత్నాకర్ రెడ్డి. గందే కృష్ణ విజయ్. బోయార్ విజయ్. శివ. అర్జున్ సూర్యకిరణ్. శ్రీనివాస్ నగేష్ రెడ్డి. గోపి విజయ్ కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.