బీఆర్ఎస్ లీడర్ల బలోపేతానికి పథకాలు
టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత

ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి పథకం నిరుపేదలకు మేలు చేస్తుందో లేదో కానీ,బీఆర్ఎస్ లీడర్ల ఆర్థిక బలోపేతానికి మాత్రం పనికి వస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆరోపించారు.గతంలో దళిత బస్తి లో కొందరు ఎమ్మెల్యే లు అవినీతికి పాల్పడ్డారని స్వయంగా సీఎం కేసీఆర్ పేర్కొనడం చూస్తే బీఆర్ఎస్ లీడర్లు అవినీతి ఏ మేరకు కొనసాగుతుందో అర్థమవుతుందన్నారు.ఆదిలాబాద్ లోని తన స్వగృహంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాజాగా బీసీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టడం చూస్తే బీసీలను మోసం చేయడానికి ఈ పథకం అమలు చేస్తుందన్నారు.ఏ పథకాలైన ఎమ్మెల్యే కనుసనల్లో పనిచేసే కార్యకర్తలకు,నాయకులు చెప్పిన వారికే పథకాల లబ్ది పొందుతున్నారన్నారు. నిజమైన,అర్హులైన పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని పేర్కొన్నారు.ఈ మీడియా సమావేశంలో మాజీ సొసైటీ డైరెక్టర్ వెంకటరెడ్డి,కిస్థూ, కన్య ప్రభాకర్ రెడ్డి,దండు మధుకర్,తూడం వినోద్,వెంకట్,సంజీవ్,ఇమ్రాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.