బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక ఆలయ నిర్మాణాలు

ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్‌: ఆలయాల నిర్మాణాలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని సాయి నగర్ లో నిర్మించనున్న హనుమాన్ ఆలయ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. స్థానికులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు.అనంతరం ఆలయ నిర్మాణంపై స్థానికులతో చర్చించారు. హనుమాన్ ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆయా కాలనీలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణాలు జరుగుతుండడం హర్షనీయమని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారని అన్నారు. ఆలయాల అభివృద్ధికి తమ వంతుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హిందూ ధర్మ విశిష్టతను నేటి తరానికి తెలియచేపుతూ.. ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని సూచించారు.కార్యక్రమంలో కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మణ్, బీ.ఆర్.ఎస్ యువ నాయకులు జోగుమహేందర్, దేవిదాస్, శ్రీనివాస్, గణేష్, ఆనంద్ రెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.