బాధిత కుటుంబాలను పరామర్శించిన బలరాం జాదవ్

గుడిహాత్నూర్, మండలం లింగాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముర్కుటే ఏక్ నాథ్,ముర్కుటే ప్రభు మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వివరాల్లోకి వెళితే ముర్కుటే ప్రభు అనారోగ్యంతో బాధపడుతు రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందు తున్నడు.ఏక్ నాథ్ ఆదివారం రాత్రి రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమ బంధువు ప్రభును చూసేందుకు బైక్ పైన వెళ్ళాడు.ప్రమాద వశాత్తూ బైక్ అదుపు తప్పి పడిపోయాడు.చికిత్స పొందుతూ సోమవారం ఏక్ నాథ్ చనిపోయారు.అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రభు మరణించారు.అలాగే ఏక్ నాథ్ తో పాటు బైక్ పైన వెళ్ళిన నిర్వత్ నాథ్ గాయాలపాలయ్యారు.వారిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు సుభాష్,శంకర్,రవి,గిత్తే తరుణ్,నితీష్ తదితరులు ఉన్నారు.