బహుజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి
బీఎస్పీ జిల్లా కార్యదర్శి మిర్జా అరిఫ్ బెగ్

ఇంద్రవెల్లి : ఈనెల 17న ఇచ్చోడ మండల కేంద్రంలోని షార్ప్ గార్డెన్ లో బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో తలపెట్టిన బహుజన ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిర్జా అరిఫ్ బెగ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సభకు సంబంధించిన గోడపత్రులు నాయకులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల బతుకులు మారాలంటే బీఎస్పీ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ బహుజన ఆత్మ గౌరవ సభకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్నట్లు తెలిపారు.కావున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరిలివచ్చి బహుజన ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు సోయం రాందాస్, ఉపాధ్యక్షుడు వావల్కర్ శివాజీ, మండల అధ్యక్షుడు పెందుర్ అంకుష్,ఉపాధ్యక్షులు జొందలే విజయ్, లాండ్గే సాయి, కాంబ్లే దీపక్,తదితరులు పాల్గొన్నారు.