ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా నేరాలు తగ్గుముఖం

ఆదిలాబాద్:ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాదు, బోథ్ శాసన సభ్యులు జోగు రామన్న,రాథోడ్ బాపూరావు, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ముఖ్య కారణం పోలీసులు అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అన్నారు. ఆదిలాబాదు శాసన సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పోలీసు శాఖలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని, పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజల రక్షణలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం అనేక రకాల నూతన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు ఏర్పాటుచేసి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసిందని తెలిపారు.అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్యెల్యేలు సురక్ష ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణ ప్రధాన కూడళ్లలో సాగి ప్రజలకు ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తూ తిరిగి పోలీస్ ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, అదనపు ఎస్పీ లు, డిఎస్పీలు, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.