ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి

మంచిర్యాల: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, జిల్లా విద్యార్థి విభాగం నాయకులు తోకల సురేష్ యాదవ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాకు నూతనంగా వచ్చిన యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు.. అనంతరం వారు విద్యా పలు అంశాలపై డీ ఈ ఓ తో వారు చర్చించారు.జిల్లాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని,అలాగే ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్ ఈ ఓ పోచయ్య,తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేశం గౌడ్, రఘు, శ్రీకాంత్, హలీం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.