ప్రారంభమైన బడిబాట కార్యక్రమం

ఇంద్రవెల్లి : 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాద్యాయుడు గోపాల్ సింగ్ తీలావత్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను తల్లి తండ్రులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించి వారిని సమీపంలో గల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.ఒకటవ తరగతి నుండే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు.105 ఆరవ తరగతి పిలల్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు నటేష్,సురేష్,కుసుమ,మురళి,లత తదితరులు పాల్గొన్నారు.