ప్రశాంతమైన వాతావరణం లో పండుగ జరుపుకోవాలి
బెల్లంపల్లి ఏసీపీ సదయ్య

బెల్లంపల్లి: రాబోవు బక్రీద్, తొలి ఏకాదశి, మరియు బోనాల జాతర పండుగ సందర్భంగా ముస్లిం, హిందూ మత పెద్దలతో తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సందర్బంగా బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల జాతర పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి ముస్లిం, హిందూ మత పెద్దల యొక్క సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ. బక్రీద్ సందర్భంగా గోవధ చేయవద్దని, ప్రభుత్వం గోవధ నిషేధించడం జరిగిందని తెలిపారు. గోవధ చేసే వారిపై, గోవులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగను నిర్వహించుకోవలని, అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు., బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల జాతర పండుగలలో సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో మత ఘర్షణల ప్రేరేపిత వార్త ఏదైనా వస్తే నమ్మవద్దని తెలిపారు. పుకార్లను సృష్టించి ఎవరైనా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
ఈ సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, మత పెద్దలు, ఎస్ఐ లు ,తదితరులు పాల్గొన్నారు.