ప్రవేట్ పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ దత్త

ఇంద్రవెల్లి: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ దత్త డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని మండల విద్యాధికారి నారాయణ కు భీం ఆర్మీ, బీఎస్పీ, వంచిత్ బహుజన అఘాడి,దళిత సంఘాల అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా, పిల్లల తల్లి తండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని అన్నారు.విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు పేందుర్ అంకుష్, వంచిత బహుజన అఘాడి మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే బాబాసాహెబ్,మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాంబ్లే అతిష్,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ కోశాధికారి కాంబ్లే సునీల్, నాయకులు కాంబ్లే విక్రం,అజయ్ కాంబ్లే, కైలాష్ డవలే,బాబా బామ్నే తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.